బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 మార్చి 2022 (14:09 IST)

విశాఖపట్టమంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం

విశాఖపట్టణం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం వేకువజామున ఈ ప్రమాదం సంభవించింది. 
 
విశాఖ నగరంలోని ఎలమంచిలి పెట్రోల్ బంక్ వద్ద జాతీయ రహదారిపై బొలెరో వాహనాన్ని అటుగా వెళుతున్న లారీ ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ రోడ్డు ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపంచనామాకు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.