గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 మార్చి 2022 (10:20 IST)

జగ్గయ్యపేటలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు దుర్మరణం

కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గౌరవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన కారు ఒకటి అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రమాద స్థలంలోనే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకు వెళుతుండగా ఈ కారు ప్రమాదానికి లోనైంది. మృతులను ఇందిర, శాంతి, కుటుంబరావు, ప్రిన్సీ అనే ఆరు నెలల పాపగా గుర్తించారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.