శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 మార్చి 2022 (13:16 IST)

బాలకృష్ణ సినిమా సెట్‌లో బోయపాటి శ్రీను

తెలుగు సీనియర్ హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబోలో ఇప్పటివరకు వచ్చిన మూడు చిత్రాలు సూపర్ డూపర్ హిట్స్ సాధించాయి. తాజాగా వచ్చిన "అఖండ" చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది. దీంతో 100 రోజుల ఫంక్షన్‌ను కర్నూలులో గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. 
 
ఇదిలావుంటే, బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇది బాలయ్యకు 107వ చిత్రం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే, ఈ సినిమా సెట్‌కు బోయపాటి శ్రీను వెళ్లారు. ఆయనకు గోపీచంద్ మలినేని ఆత్మీయంగా ఆహ్వానం పలికారు. కాగా, శనివారం సాయంత్రం కర్నూలులో 'అఖండ' చిత్రం వంద రోజుల ఫంక్షన్ జరుగనుంది. 
 
ఇదిలావుంటే, బాలయ్య, గోపీచంద్‌ల కాంబినేషన్‌లో నిర్మతమవుతున్న చిత్రానికి "వీర సింహారెడ్డి" అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇందులో బాలయ్య సరసన శృతిహాసన్ నటిస్తున్నారు. విలన్ పాత్రతో దునియా విజయ్, కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.