గమ్మత్తైన చూపులతో అలరిస్తోన్న పూర్ణ
అఖండ సినిమాలో అలరించిన పూర్ణకు ఆ సినిమా అంత పేరు ఏ సినిమాకూ రాలేదు. చిన్న పాత్ర అయినా హీరోను కాపాడేవిధంగా ఆమె పాత్ర వుంటుంది. ఇంతకుముందు `సుందరి` చిత్రంలో నటించింది. కాస్త ఎక్స్‌పోజింగ్ చూపించింది. కథ ప్రకారం అలాంటి పాత్రలు చేయడానికి సిద్ధమేనంటూ ప్రకటించింది. అయితే ఆమెకు ప్రస్తుతం మలయాళ సినిమాలో ఓ పాత్ర లభించింది. గమ్మతైన లుక్‌తో నల్లటి దుస్తులతో వున్న పిక్‌ను ఆమె పోస్ట్ చేసింది.
తెలుగు, మలయాళంలో మంచి గుర్తింపు పొందిన ఆమెకు ఈ సినిమా మరింత పేరు తెస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. ఇందులో గ్లామర్ తరహా పాత్రను పోషిస్తోంది. అయితే అది కూడా పాత్ర పరిధిమేరకు వుంటుందని తెలియజేస్తోంది. సుందరి తర్వాత ఆమె చేస్తున్న ఈ గ్లామర్ ఎలా వుంటుందో మరి. యూత్‌ను బాగా ఆకట్టుకుంటుందేమో చూడాలి.