శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (15:17 IST)

#NBK107 : కొత్త లుక్‌లో నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ లుక్‌లో కనిపించనున్నారు. ఇది ఆయన 107వ చిత్రం. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభంకాగా, హీరో బాలకృష్ణ సైతం సెట్స్‌లో కలిసిపోయారు. 
 
పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కే ఈ చిత్రంలో శృతిహాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్  పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ కూడా తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్లలో ఇటీవల ప్రారంభమైంది. 
 
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నిర్మించే ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రాఫర్‌గానూ, తమన్ సంగీత బాణీలు సమకూర్చనున్నారు. ఎడిటర్‌గా నవీన్ నూలి పనిచేయనున్నారు. 
 
అయితే, ఎన్.బి.కె.107 సెట్స్ నుంచి ఓ ఫోటో లీకైంది. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైగా, ఇది అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇదిలావుంటే, బాలకృష్ణ తాజాగా చిత్రం అఖండ భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెల్సిందే.