గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 మార్చి 2022 (13:20 IST)

ముందస్తు ఎన్నికలు వెళ్లాల్సిన అవసరం మాకు లేదు : సజ్జల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, ఏ క్షణమైనా తాము ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారు. ఈ వార్త ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకేముందని ఆయన ప్రశ్నించారు. పైగా, అది చంద్రబాబు రాగమని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఇప్పటికే అడుగంటిన పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు ముందస్తు డ్రామాకు తెరతీశారని చెప్పారు. మాకు ఐదేళ్లు ప్రజలు అధికారం ఇచ్చారని, ఆ కాలాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన చెప్పారు. ప్రజల్ని మోసం చేయాలి, భ్రమపెట్టాలి అనుకున్నవారే ముందస్తుకు వెళతారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.