1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (18:48 IST)

జూనియర్ ఎన్టీఆర్ ర్యాగింగ్ చేశారు...

తనను హీరో జూనియర్ ఎన్టీఆర్ ర్యాగింగ్ చేశారని టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానరులో మొదటి సినిమా నందమూరి హీరో కళ్యాణ్ రామ్‌తో 'పటాస్' చిత్రాన్ని తీసి మెప్పించారు. ఆ తర్వాత పలు బ్లాక్ బస్టర్ హిట్స్‌ ఇచ్చారు. 
 
తాజాగా ఆయన మాట్లాడుతూ, 'పటాస్' సినిమా షూటింగ్ జరిగే సమయంలో రోజూ ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానరు ఆఫీసుకు ఎన్టీఆర్ వచ్చేవారు. సాయంత్రం సమయంలో ఎన్టీఆర్ రావడం, నాతో మాట్లాడుతూ జోకులు వేసేవారు. ఓ రోజు ర్యాగింగ్ కూడా చేశారు. దారుణమైన జోక్స్ వేసేవారు. నేను వాటిని చాలా బాగా ఎంజాయ్ చేసేవాడిని అని చెప్పారు. 
 
అంత పెద్ద హీరో అయినా ఎపుడూ అలా ప్రవర్తించలేదని అనిల్ రావిపూడి చెప్పారు. ప్రతి చిన్న విషయంలో కూడా సరదాగా అల్లరి చేయడం, నాపై చిన్న విషయంలో కూడా జోకులు వేయడం చేసేవాడు, ఆ రోజులు నేను ఎప్పటికీ మరిచిపోలేను. 'పటాస్'  సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయాలని అనకున్నాను. కానీ, అది వర్కౌట్ కాలేదు అని చెప్పారు.