గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (16:55 IST)

విడాకుల తర్వాత జీవితం హాయిగా వుంది : హీరోయిన్ ఎస్తర్

తన భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తన జీవితం హాయిగా, సంతోషంగా గడిచిపోతుందని హీరోయిన్ ఎస్తర్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, విడాకులు తీసుకునే ముందు చాలా ఒత్తిడికి గురయ్యాను. కానీ ఎపుడైతే అన్నింటికి సిద్ధపడి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నానో అపుడే ఫ్రీ అయ్యా. బయటి వాళ్ల విడాకుల గురించి వినడమే కానీ, తనకు కూడా ఈ పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. 
 
విడాకుల విషయంలో తన కుటుంబ సభ్యులకు ఏ విధంగా నచ్చజెప్పాలని భయపడ్డానని, కానీ, నా తల్లిదండ్రులు తనకు అండగా నిలబడ్డారని, దాంతో నాకు రెట్టింపు ధైర్యం, శక్తి వచ్చిందన్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఇపుడు నా జీవితం హాయిగా గడిచిపోతుందని చెప్పారు. 
 
కాగా, "భీమవరం బుల్లోడు" చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరోయిన్ ఎస్తర్ నోరోన్హ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా, మరికొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. ఆ పిమ్మట ప్రముఖ ర్యాంప్ సింగర్, బిగ్ బాస కంటెస్టెంట్ నోయల్‌ సేన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ, వీరు పెళ్లి చేసుకున్న ఆరు నెలలకే విడాకులు తీసుకున్నారు.