1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (14:28 IST)

అలా చేస్తే గోతులు తవ్వుకున్నట్టే : మోహన్ బాబు

చిత్రపరిశ్రమలో రాజకీయాలు ఎక్కువైపోతున్నాయని, ఇలాచేయడం ద్వారా ఎవరి గోతులు వారు తవ్వుకుంటున్నారని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తెలుగు హీరోలు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీకి తనకు కూడా ఆహ్వానం అందిందన్నారు. కానీ, కొందరు తనను ఉద్దేశ్యపూర్వకంగా పక్కన పెట్టారని ఆయన అన్నారు. 
 
ఇకపోతే, సినిమా హీరోలు భారీ రెమ్యునరేషన్ తీసుకోవడంపై తాను స్పందించనని చెప్పారు. నా గురించి మాత్రమే నేను మాట్లాడుతాను. పరిశ్రమ మొత్తం ఒక కుటుంబం అంటూనే పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
బయట రాజకీయాలు మాదిరిగానే పరిశ్రమలోనూ రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. ఎవరికి వారే గ్రేట్ అనుకుంటున్నారు. నా దృష్టిలో ఎవరూ గొప్పకాదు. మనం చేసే పనులన్నింటిపైనా ఆ భగవంతుడు ఉన్నాడు, చూస్తున్నాడు అని వ్యాఖ్యానించారు.