మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (08:09 IST)

దేశం బాగుప‌డాలంటే హిట్ల‌ర్ వంటి నాయ‌కుడు రావాలి - మోహన్ బాబు

Mohan Babu
స‌మాజం ఎంతో భ్ర‌ష్టుప‌ట్టేసింది. రాజ‌కీయ‌నాయ‌కులు కొంత‌మంది దేశాన్ని నాశ‌నం చేస్తున్నారు. కొంద‌రు మంచివారు బాగుచేయాల‌ని చూస్తున్నా లాగేస్తున్నారు. యూత్ మారాలి. మ‌న దేశం బాగుప‌డాలంటే హిట్ల‌ర్ వంటి నాయ‌కుడు రావాలి` అని  మోహన్ బాబు తేల్చిచెప్పారు.
 
డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో చేసి చాలా కాలమే అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు తాను హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “సన్ ఆఫ్ ఇండియా” రిలీజ్ కి దగ్గర పడుతున్న సందర్భంగా ఆదివారంనాడు ఆయ‌న మీడియాతో ప‌లు విష‌యాలు పంచుకున్నారు.
 
మీడియాతో చాలా గ్యాప్ తీసుకున్నట్టు ఉన్నారు?
 
అవును దాదాపు మూడేళ్లు దాటి పోయింది డైరెక్ట్ గా ఓ సినిమా చేసి. ఇప్పుడు ఫైనల్ గా అయ్యి మీ అందరితో కలిసి కూర్చోవడం ఆనందంగా ఉంది. మీరంతా బాగున్నారని, బాగుండాలని దైవ సాక్షిగా నేనెప్పుడూ కోరుకుంటాను.
 
మరి ఈ సినిమా ఎలా స్టార్ట్ అయ్యింది? మీరెలా ఓకే చేశారు?
 
ఈ సినిమా కథ ని డైమండ్ రత్నబాబు ఒక విభిన్న కథ చెప్పినపుడు చాలా బాగుంది అనిపించింది. మా గురువు గారు కూడా ఎన్నో ప్రయోగాలు చేశారు నేను కూడా చేసి చూద్దాం అనుకున్నాను. సినిమా చూసి ఎవరూ కూడా బాగోలేదు అనుకోరు. యూత్ కి కూడా కనెక్ట్ అయ్యే అంశాలు చాలానే ఉన్నాయి. అది ముందు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను.
 
ఈ సినిమా కి సెన్సార్ వారు ఏమన్నా కట్స్ చెప్పారా?
 
సెన్సార్ లో ఈ సినిమాకి అక్కడక్కడా కొన్ని మ్యూట్స్ చెప్పి కట్ చేశారు. అవి చెప్పొచ్చో లేదో కానీ అవి ఉన్నాయి. అలాగే సినిమాలో కొన్ని ముద్దు సన్నివేశాలకి కూడా ఎలాంటి అభ్యంతరం పడలేదు. ఎంతవరకు ఉండాలో అంత మేరే పెట్టాం.
 
మీరు డైరెక్షన్ చేసే అవకాశం కూడా ఉందా..?
 
డైరెక్షన్ చెయ్యడానికి రెండు స్క్రిప్ట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను కానీ అవి చేసేటప్పుడు ఎవరొకరిని కొడతానేమో అని భయం వేసి. నాకు మిగతా వారికి సెట్టవ్వకపోతే అలా ఉంటుంది.
 
సినిమా నిడివి ఎంత ఉంటుంది ఓటిటి కి ఏమన్నా మార్చారా?
 
మొదట ఈ సినిమాని ఓటిటికి ఇచ్చేద్దామని అనుకున్నాం అందుకే కొన్ని సన్నివేశాలు యాడ్ చేసాం. కానీ తర్వాత థియేటర్స్ లో రిలీజ్ అని కొంచెం మార్చాం. అలాగే ఓటిటి కోసం అనే ప్లాన్ లోనే గంటన్నర సేపే ప్లాన్ చేసాం. ఇప్పుడు కూడా పెద్ద మార్పు ఉండదు గంటన్నర మాత్రమే సినిమా ఉంటుంది.
 
ఈ సినిమాలో మీ పాత్ర ఎంత వైవిధ్యంగా ఉంటుంది?
 
ఈ సినిమాలో నాది చాలా డిఫరెంట్ పాత్ర. ఎక్కడా తగ్గకుండా ఉంటుంది. డైలాగ్స్ కానీ ఎక్స్ ప్రెషన్స్ గాని అందరూ అభినందించేలా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు.
 
మీ జీవితంపై ఆత్మకథ ఏమన్నా రాసే ఆలోచన ఉందా? బయోపిక్ గాని తీస్తారా?
 
అవును నా కథపై పుస్తకం రాస్తున్నాను. దాదాపు అది అయ్యిపోవచ్చింది. సినిమా అనీ ఆలోచన లేదు అలాగే ఎవరు హీరో అనేది నేను చెప్పలేను.
 
మరి ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ లు ఏమన్నా ఉన్నాయా?
 
ముందు ఈ సినిమా చూడాలి, హిట్ అయితే.. కొన్ని ప్రాజెక్ట్ లు ఉన్నాయి. విష్ణు తో ఓ సినిమా ఉంది. లక్ష్మి ది ఓ సినిమా ఉంది ఓటిటి కి వెళ్తుంది అనుకుంటా. రెండు మూడు సబ్జెక్టులు అయితే ప్రస్తుతానికి ఉన్నాయి.
 
ఇప్పటివరకు మీ జీవితంలో ఇది చెయ్యలేదు అలాంటిది చెయ్యాలి అనేమన్నా అనుకుంటున్నారా?
 
ఇప్పటి వరకు అంటే నేనేమీ అనుకోలేదు.. అన్నీ అనుకోనివే జరుగుతున్నాయి. పైవాడు ఆల్రెడీ ఎక్కడ ఏది జరగాలో రాసేసాడు. అదే జరుగుతుంది. మీకు ఒక్క విషయం చెప్పాలి. తిరుపతిలో మన క్యాంపస్ ఉంది దాని పక్కన బాబా దేవాలయం కడుతున్నాము. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన 100 మందిలో 100 మందీ మా బాబా గుడికి వచ్చి వచ్చి దర్శనం చేసుకొని వెళతారు. అటువంటి మహత్తర శక్తితో రుషికేషి నుంచి గొప్ప మేధావులతో కొన్ని యంత్రాలు వేసి బాబాను ప్రతిష్ఠిస్తున్నాం. దాదాపు నాలుగున్నర కోట్లతో ఈ ఆలయ నిర్మాణం జరుగుతుంది. మనకు ఎవరికీ తెలియని మూలికలతో హిమాలయాల్లో ఉండే తపస్వులతో సిద్ధం చేస్తున్నాం. వచ్చే ఏప్రిల్ నెల నుంచి ఆరంభించాలని అనుకుంటున్నాం.
మీరు రాజ‌కీయా\ల్లోకి మ‌ళ్ళీ వ‌స్తారా?
రాను. ఈ రొంపిలో దిగ‌ను. 
దేశ ప‌రిస్థితులు ఎలా అనిపిస్తున్నాయి?
ఇది అంద‌రికీ తెలిసిందే. నేను ఎప్ప‌టినుంచో చెబుతూనే వున్నా. యూత్ మేథావులున్నారు. వారంతా మారాలి. దేశాన్ని మార్చాలంటే హిట్ల‌ర్ వంటి నాయ‌కుడు ఒక‌డు రావాలి.
ఇప్పుడు ఉన్న అధినేత అలాంటివాడే అని అంటున్నారు?
అది నేను చెప్ప‌ను. అంటూ ముగించారు.