శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 ఫిబ్రవరి 2022 (17:40 IST)

తెలుగు సినీ కథా రచయిత చిన్నికృష్ణపై రియల్టర్ల దాడి...

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సినీ కథా రచయిత చిన్నకృష్ణపై దాడి జరిగింది. ఆయనపై కొందరు రియల్టర్లు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడి ఘటన సంచలనంగా మారింది. 
 
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన శంకర్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్నకృష్ణ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. దీంతో ఆగ్రహించిన స్థానిక రియల్టర్లు చిన్నకృష్ణపై దాడికి యత్నించారు. పరుష పదజాలంతో దూషించారు. 
 
ఈ దాడి ఘటనపై శంకర్ పల్లి పోలీస్ స్టేషన్‌లో చిన్నకృష్ణ ఫిర్యాదు చేశారు. కోవిడ్‌తో ఇబ్బందిపడుతున్న తనను ఇంట్లోకి చొచ్చుకొచ్చిన కొందరు రియల్టర్లు బెదిరించారని ఆయన పేర్కొన్నారు. తన స్థలానికి గ్రామ పంచాయతీ కూడా క్లియర్ పిక్చర్ ఇచ్చారని, అయినప్పటికీ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ దాడి ఘటన స్థానికంగా కలకలం చెలరేగింది. దీంతో కొందరు సినీ ప్రముఖులు ఆయనకు ఫోన్ చేసి విచారించారు.