మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (17:05 IST)

సీఎం కేసీఆర్‌‍పై కేసు నమోదు చేయనున్న పోలీసులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. పుల్వామా దాడి తర్వాత భారత ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తీవ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సర్జికల్ స్ట్రైక్స్‌ జరిపాయి. వీటిపై ఆర్మీని ప్రశ్నించినందుకు పలువురు నేతలపై బీజేపీ నేతలు ఆయా పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేస్తున్నారు. 
 
బీజేపీ నేతలు ఫిర్యాదు చేసిన వారిలో కేసీఆర్ పేరు కూడా ఉంది. దీంతో ఆయనపై కేసు నమోదు చేసే అంశాన్ని పోలీసులు ముమ్మరంగా పరిశీలిస్తున్నారు. 
 
మరోవైపు సర్జికల్ స్ట్రైక్ అంశంపై తెలంగాణ రాష్ట్ర ముఖయమంత్రి బీజేపీకి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ప్రపంచమంతా చూసిందని ఆయన అన్నారు. 
 
మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సర్జికల్ స్ట్రైక్స్ జరపడం వల్లే పాకిస్థాన్‌లో అభినందన్ అనే యుద్ధ వీరుడు పట్టుపడితే 24 గంటల్లో ఇండియాకు రప్పించామని తెలిపారు.