ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (18:34 IST)

డియర్ కేసీఆర్ గారూ, ఇదిగోండి సర్జికల్ స్ట్రైక్స్ వీడియో?

తెలంగాణలో సీఎం కేసీఆర్ పతనం ప్రారంభమైందని, కేసీఆర్ పరిపాలన నుంచి  ప్రజలు త్వరగా విముక్తి పొందాలని కోరుకుంటున్నారన్నారనికేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.
 
ఎన్నికలు వచ్చినప్పుడల్లా సర్జికల్ స్ట్రైక్‌పై ప్రశ్నలు వేస్తున్నారన్నారు"సర్జికల్ స్ట్రైక్స్"పై కాంగ్రెసు పార్టీ,  టిఆర్ఎస్ ఒకే పాట పడుతున్నాయని చెప్పారు. భారత సైనికుల వీరత్వాన్ని ప్రశ్నించేలా కేసీఆర్ మాట్లాడడం శోచనీయమన్నారు.
 
భారత సైనికులు ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేశారనేది సత్యం అని పునరుద్ఘాటించారు.  కాంగ్రెస్ పార్టీకి, కేసీఆర్‌కు భారత సైనికుల కంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు పైనే నమ్మకం ఎక్కువగా ఉన్నట్టుంది ? అని నిలదీశారు. డియర్ కేసీఆర్ గారూ, ఇదిగో మన వీర సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్ వీడియోగ్రాఫిక్ సాక్ష్యమన్నారు.