శనివారం, 7 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 మార్చి 2022 (07:29 IST)

నేడు ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య మూడో విడత చర్చలు

ఉక్రెయిన్, రష్యా దేశాలు ఒకవైపు యుద్ధం చేస్తున్నాయి. ఈ యుద్ధం గత వారం రోజులుగా కొనసాగుతుంది. మరోవైపు, శాంతి చర్చల పేరుతో చర్చలు ప్రారంభించాయి. గత సోమవారం తొలి దఫా చర్చలు జరిపాయి. ఈ చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం రెండో దఫా చర్చలు జరుపనున్నారు. ఈ చర్చలు కూడా బెలారస్‌లోనే జరుగనున్నాయి. కనీసం ఈ చర్చల్లో అయినా ఇరు దేశాల మధ్య సంధి కుదురుతుందో లేదో వేచిచూడాల్సింది. 
 
మరోవైపు, వారం రోజుల క్రితం ఉన్నఫళంగా ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను ప్రారంభించిన విషయం తెల్సిందే. గత వారం రోజులుగా సాగుతున్న యుద్ధం రష్యా అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. ఈ మరోవైపు, రష్యా దాడులను తిప్పికొట్టేందుకు తన వద్ద ఉన్న స్వల్ప ఆయుధ సంపత్తితోనే ఉక్రెయిన్ ఎదురొడ్డి నిలుస్తుంది. ఈ క్రమంలోనే ఇరు దేశాలు చర్చలకు పూనుకోవడం గమనార్హం.