బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 మార్చి 2022 (23:16 IST)

వాట్సాప్ చాట్‌ భద్రంగా వుండాలంటే.. ఏం చేయాలి..?

వాట్సాప్ చాట్‌లోని విషయాలు ఇతరులకు తెలియకుండా ఉండాలని భావిస్తే కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి అంటున్నారు ఐటీ నిపుణులు. వాట్సాప్ యాప్‌ను ఎక్కువగా వాడేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. 
 
వాట్సాప్ యాప్‌లో టూ స్టెప్ వెరిఫికేషన్‌ను యాక్టివ్‌గా ఉంచుకుంటే కూడా ఇతరులు మన చాట్‌ను, ఇతర విషయాలను తెలుసుకోవడం సాధ్యపడదు. 
 
ఇతరులు ఫోన్/లోని వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయకూడదని అనుకుంటే యాప్‌కు టచ్ ఐడీ లేదా పాస్ వర్డ్‌ను పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఫోన్‌ను ఇతరులు తీసుకున్నా వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. 
 
వాట్సాప్‌ను కొంతమంది మొబైల్‌తో పాటు డెస్క్ టాప్‌లో కూడా వాడతారు. ఫోన్‌లో అవతలి వ్యక్తుల సెక్యూరిటీ కోడ్ మారితే సదరు వ్యక్తులే మనతో చాట్ చేస్తున్నారో లేదో నిర్ధారించుకుంటే మంచిది.