బుధవారం, 4 ఫిబ్రవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By దేవి
Last Updated : శనివారం, 20 డిశెంబరు 2025 (14:04 IST)

Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి రివ్యూ.. రేటింగ్ ఎంత?

Gurram Paapi Reddy Review
Gurram Paapi Reddy Review
నటీనటులు : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగిబాబు, జీవన్, రాక్ కుమార్ కసిరెడ్డి, వంశీధర్ గౌడ్, జాన్ విజయ్ తదితరులు
దర్శకుడు : మురళీ మనోహర్
నిర్మాణం : వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ)
సంగీత దర్శకుడు : కృష్ణ సౌరభ్ సూరంపల్లి
సినిమాటోగ్రాఫర్ : అర్జున్ రాజా
ఎడిటర్ : కార్తీక్ శ్రీనివాస్
 
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన నటుడు నరేష్ అగస్త్య హీరోగా నటించిన క్రైమ్ కామెడీ చిత్రం “గుర్రం పాపిరెడ్డి. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
 
కథ.. గుర్రం పాపిరెడ్డి (నరేష్ అగస్త్య), సౌదామిని (ఫరియా అబ్దుల్లా) కలిసి ఒక ముగ్గురు గ్యాంగ్ గొయ్యి (జీవన్), చిలిపి (వంశీధర్ గౌడ్) అలాగే మిలట్రీ (రాజ్ కుమార్ కసిరెడ్డి) లతో కలిసి శ్రీశైలంలో ఉన్న ఒక శవాన్ని తీసుకొస్తారు. దానిని శ్రీనగర్ కాలనీలోని స్మశాన వాటికలో మరో శవంతో మార్చాలని ప్లాన్ వేస్తారు. అసలు ఆ శవం ఎవరిది? ఎందుకు మార్చాలనుకున్నారు? ఈ క్రమంలో రాజ కుటుంబీకులు హైగ్రీవ (జాన్ విజయ్), నీలగ్రీవ (ప్రదీప్ రుద్ర) లు గుర్రం పాపిరెడ్డిని టార్గెట్ చేసి అతన్ని వెతుకుతూ ఉంటారు. 
 
అసలు గుర్రం పాపిరెడ్డి ఎవరు? అతడు వీళ్ళకేం చేసాడు? పైగా వాళ్ళ ఆస్తి ఎందుకు కొట్టేయాలని చూస్తాడు? చివరగా ఎవరికి లాభం వచ్చింది? ఎవరికి నష్టం వచ్చింది? అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.
 
సమీక్ష:
శవం కాన్సెప్ట్‌తో ఎంటర్టైన్ చేశారు. దర్శకుడు ప్రతీ పాత్రని డిజైన్ చేసుకున్న విధానం వాటి చుట్టూ డిజైన్ చేసిన కామెడీ ట్రాక్ లు నవ్వు తెప్పిస్తాయి. మెయిన్ గా ఫస్టాఫ్ లో కామెడీ ట్రాక్స్ సినిమా మొదలైన ఒక అరగంట పాటుగా సాలిడ్ ఫన్ తో కథనం సాఫీగా వెళ్ళిపోతుంది. ఇందులో నటుడు జీవన్ హైలైట్ అని చెప్పొచ్చు. 
 
శేఖర్ కమ్ముల సినిమాల వల్ల వెలుగులోకి వచ్చిన జీవన్ ఇందులో తాను చేసిన గొయ్యి పాత్రలోని అమాయకత్వం, అందులో తన పెర్ఫామెన్స్ లు చాలా బాగుంది. ఇక తనతో పాటుగా మిలట్రీ పాత్రలో రాజ్ కసిరెడ్డి కూడా సాలిడ్ ఫన్ ని అందించాడు. స్మశాన వాటికలో ట్రాక్ ఇంకా క్లైమాక్స్‌లో యోగిబాబుతో ఫన్ సీన్స్ బాగున్నాయి.
అలాగే  నరేష్ అగస్త్యకి మరో డీసెంట్ రోల్ పడింది అని చెప్పొచ్చు. 
 
తన మార్క్ ఈజ్‌తో తన రోల్‌లో మంచి టైమింగ్ తో తను నటించాడు. అలాగే ఫరియా కూడా తన రోల్ లో బాగా చేసింది. గ్లామర్ తో పాటుగా మంచి నటన ఆమె ప్రదర్శించింది. ఇద్దరు లీడ్ నటులూ ప్రొస్థెటిక్ మేకప్ లో సీన్స్ చేయడం తమ డెడికేషన్ చూపిస్తుంది. 
 
ఇక వీరితో పాటుగా వంశీధర్ గౌడ్ కూడా తన రోల్‌లో మంచి ఫన్ ని అందించాడు. అలాగే ఈ సినిమాలో వచ్చే ఫన్ సీన్స్ వరకు మాత్రం ఎంటర్టైన్మెంట్ పరంగా ఎలాంటి డోకా ఉండదు, కొన్ని ట్విస్ట్ లు డీసెంట్ గా అనిపిస్తాయి
అయితే..ఈ సినిమాలో డీసెంట్ ఫన్ అండ్ ట్విస్ట్ లు ఉన్నప్పటికీ కథనం మాత్రం సాగదీతగా చూసే ఆడియెన్స్ సహనానికి పరీక్ష పెట్టినట్టుగా సాగుతూనే ఉంటుంది. 
 
ఈ విషయంలో దర్శకుడు మరింత కేర్ తీసుకోవాల్సింది. స్టార్టింగ్ ఒక అరగంట నుంచి నలభై నిమిషాలు మంచి ఫన్ ట్రాక్స్ తో వెళ్లిన సినిమా మెయిన్ ప్లాట్ లోకి వెళ్లిన తర్వాత అందులో బలం లేదు అనిపిస్తుంది. కొంచెం రొటీన్ ప్లాట్ నే తీసుకొని నడిపించినట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఈ మధ్య కాలంలోనే వచ్చిన కొన్ని ఫన్ క్రైమ్ థ్రిల్లర్స్ గుర్తు రాక మానవు. దానితో ఫీల్ మిస్ అవుతుంది. 
 
కనుక ఒకింత నిరాశ చేస్తుంది. దీనికి తోడు ఒక ఫ్లోలో వెళ్తున్న కథనంకి ఆ పాటలు మరింత అడ్డుగా అనిపిస్తాయి. ఎడిటింగ్ లో ఫస్టాఫ్ లో ఓ సాంగ్ సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్‌లో ఓ సాంగ్ తీసేసి ఉండాల్సింది. అప్పుడు కథనం ఇంకొంచెం టైట్ గా ఉండేది. వీటి మూలాన సినిమా ఇంకా పెద్దగా అనిపిస్తుంది. 
 
అలానే మెయిన్ లీడ్ పాత్రలు తమకి ఓ నష్టం జరిగాక చకచకా వేసేసే ప్లాన్ లు రియాలిటీకి దూరంగా సిల్లీగా అనిపిస్తాయి. యోగిబాబు ను తక్కువే వాడుకున్నారు. ఇంకా లెజెండరీ బ్రహ్మానందంకి ఇంకా మంచి ఫన్ ట్రాక్స్ సెట్ చేసుకొని ఉంటే బాగుండేది. ఇలా ఈ సినిమాలో మెప్పించే అంశాలు ఎన్ని ఉన్నాయో.. వాటికంటే బోర్ గా నొప్పించే అంశాలు అంతకు ఎక్కువే ఉన్నాయి.
 
ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం డీసెంట్‌గా ఉన్నాయి. మేకర్స్ పెట్టిన ఖర్చు కనిపిస్తుంది. అలానే ప్రొడక్షన్ డిజైన్ కూడా డీసెంట్ గా ఉంది. కృష్ణ సౌరభ్ సంగీతం బాగుంది. అర్జున్ రాజా కెమెరా వర్క్ బాగుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ లో కొంతమేర బాగానే ఉంది కానీ కొన్ని ల్యాగ్ సీన్స్ ఇంకా పాటలు కట్ చేయాల్సింది. నిరంజన్ రామిరెడ్డి అందించిన డైలాగ్స్ వర్క్ బాగుంది. మెయిన్‌గా కామెడీ రైటింగ్ బాగుంది.
 
 ఇక దర్శకుడు మురళీ మనోహర్ విషయానికి వస్తే.. పాయింట్‌లో మాత్రం సింపుల్‌గానే ఉంది. మెయిన్‌గా డెప్త్ ఇందులో ఈ క్రైమ్ కామెడీ మరింత ఇంపాక్ట్ చూపించి ఉండేది.
 
ఈ గుర్రం పాపిరెడ్డిలో ప్రధాన పాత్రలు అంతా మంచి పెర్ఫామెన్స్‌లని అందించారు. అలాగే అక్కడక్కడా మంచి ఫన్ ట్రాక్స్ ఇందులో హిలేరియస్‌గా వర్కౌట్ అవుతాయి. కాకపోతే ఈ ఫన్ కి తగ్గట్టుగా కథనం కూడా కొంచెం గ్రిప్పింగ్‌గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. 
 
రేటింగ్: 2.75/5