శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 మే 2022 (22:40 IST)

అశోకవనంలో అర్జున కళ్యాణం.. విశ్వక్ సేన్‌కు కలిసొచ్చింది..(video)

Vishwaksen
Vishwaksen
అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్ సెన్సేషన్ అనే చెప్పాలి. కానీ రిలీజ్ తర్వాత టాక్, బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ అదిరింది. విశ్వక్సేన్ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అది యూత్, ఫ్యామిలీస్ ఇష్టపడే అంశాలున్న సినిమా కావడంతో సినిమాకు ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ వచ్చాయి. 
 
తొలి రోజు మార్నింగ్, మ్యాట్నీ షోలతో పోలిస్తే తర్వాతి రెండు షోలకు ఆక్యుపెన్సీ పెరిగింది. శనివారం ఈ చిత్రానికి డీసెంట్ ఆక్యుపెన్సీ కనిపించింది. దాని స్థాయిలో సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ప్రభావమే చూపిస్తోంది. ఓవర్సీస్‌లో లిమిటెడ్ రిలీజ్‌తోనే మంచి వసూళ్లు రాబడుతోంది ఈ చిత్రం.
 
ఆదివారం వసూళ్లు కూడా బాగుండడంతో 'అశోకవనంలో అర్జున కళ్యాణం' బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులు మెరుగ్గానే కనిపిస్తున్నాయి.   
 
తెలుగు సినిమాల వరకు విశ్వక్ సినిమానే విజేత. శ్రీ విష్ణు తన ఇమేజ్‌కు భిన్నంగా చేసిన 'భళా తందనాన'కు డీసెండ్ రిలీజ్ దక్కినా ఆ చిత్రానికి బిలో యావరేజ్ టాక్ రావడంతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోతోంది.