సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (23:38 IST)

అమృత్‌సర్‌లో రామ్ చరణ్: సెల్ఫీల కోసం ఎగబడిన అభిమానులు

Ram Charan
ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాముడి గెటప్పులో అదరగొట్టిన రామ్ చరణ్‌కు దేశవ్యాప్తంగా విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. తాజాగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వాని జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ అమృత్‌సర్‌లో జరుగుతోంది.

 
ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. రామ్ చరణ్‌తో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీనితో భద్రతా సిబ్బంది వారిని నెట్టివేస్తుండటంతో చెర్రీ వారించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది.

 
ఈ వీడియోలో రామ్ చరణ్ తన ఎదురుగా నిలబడి ఉన్న ఆడవాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ కనిపించాడు. తనను కలవడానికి వేచి ఉన్న సమూహంతో సెల్ఫీని క్లిక్ చేయడానికి అతను వారి ఫోన్‌ను ఎలా తీసుకున్నాడో కూడా వీడియో చూపిస్తుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రామ్ చరణ్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.