శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 మే 2022 (19:36 IST)

కృష్ణా జిల్లాలో బోల్తాపడిన పెళ్లి వ్యాను - నలుగురు మృతి

road accident
ఏపీలోని కృష్ణా జిల్లాలో ఘోరం జరిగింది. పెళ్లి బృందం వ్యాను ఒకటి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం జిల్లాలోని మోపిదేవి మండలం కాసా నగర్ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో ముగ్గురు, ఆస్పత్రిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని చల్లపల్లి మండలం చింతలమడకకు చెందినవారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యానులో మొత్తం 15 మంది ఉన్నట్టు పోలీసులు చెప్పారు.