అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్, డైరెక్టర్ ప్రియదర్శన్. హైవాన్ లుక్
Akshay Kumar, Saif Ali Khan, Priyadarshan
ప్రియదర్శన్ శైలిలో సాగే ఒక యూనిక్ థ్రిల్లర్ గా "హైవాన్" సినిమా ఉండబోతున్నట్లు ఈ ఫస్ట్ లుక్ ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రంతో డైరెక్టర్ ప్రియదర్శన్ ప్రేక్షకుల్ని ఒక డార్క్, థ్రిల్లింగ్ వరల్డ్ లోకి తీసుకెళ్లనున్నారు. ఈ ఏడాది ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో "హైవాన్" ముందు వరుసలో నిలుస్తోంది. ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో బొమన్ ఇరానీ, సయామీ ఖేర్, శ్రియ పిల్గాంకర్ నటిస్తున్నారు. హైవాన్ మూవీతో అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ 17 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తుండటం విశేషం. హైవాన్ చిత్రాన్ని టాప్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు నిర్మాతలు వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయ్ ఫెన్.
