శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 జూన్ 2022 (18:54 IST)

ప్రియురాలి కోసం ఖర్చు చేసిన లెక్కలు రాసిపెట్టి ప్రియుడు ఆత్మహత్య

ఆ యువతిని ఓ యువకుడు తొమ్మిదేళ్ళగా ప్రేమిస్తున్నాడు. ఆమె కోసం రూ.4.50 లక్షల వరకు ఖర్చు చేశాడు. కానీ, ఇంతలో ఏమైందో ఏమోగానీ ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పైగా, తన ప్రియురాలి కోసం ఖర్చు చేసిన రూ.4.50 లక్షలను వసూలు చేయాలంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టిమరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని చిక్‌మగళూరులో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చేతన్ (31) అనే యువకుడు శంకరపురకు చెందిన ఓ యువతిని తొమ్మిదేళ్లుగా ప్రేమిస్తూ వచ్చాడు. సరకు రవాణా వాహనాన్ని నడుపుతూ జీవితాన్ని గడుపుతూ వచ్చిన చేతన్.. తన ప్రియురాలి సరదాలు తీర్చేందుకు తన వేతనంలో సగం జీతం ఖర్చు చేసేవాడు. తన ప్రియురాలు సంతోషంగా ఉంటే చాలని చేతన్ భావించాడు. 
 
కానీ, ఆమె మాత్రం అతన్ని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో తీవ్ర మనస్తాపానికిగురైన చేతన్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ప్రియురాలి సంతోషాల కోసం తాను ఖర్చు చేసిన రూ.4.50 లక్షలను ఆమె నుంచి వసూలు చేయాలంటూ సూసైడ్ లేఖ రాసిపెట్టి చనిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.