గురువారం, 18 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 జూన్ 2022 (15:19 IST)

వెడ్డింగ్ కార్డులు పంచుతున్న నయన్ - విఘ్నేష్

nayan wedding card
కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార్, కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ ప్రేమ జంట ఈ నెల 9వ తేదీన వివాహం చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ అతి ముఖ్యమైన వారికి స్వయంగా వెళ్లి వెడ్డింగ్ కార్డులను పంపిణీ చేస్తున్నారు. 
 
తాజాగా శనివారం రాత్రి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు నయనతార, విఘ్నేష్‌లు వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి తమ వివాహానికి రావాలని ఆహ్వానించారు. కాగా, వీరిద్దరి వివాహం తొలుత తిరుపతిలో జరుపుకోవాలని భావించారు. కానీ, మనస్సు మార్చుకుని మహాబలిపురం సమీపంలోని ఓ నక్షత్ర హోటల్‌లో ఈ పెళ్ళి వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ఈ పెళ్లి ముహుర్తానికి ముందు రోజు గ్రాండ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. కోలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమచారం మేరకు జూన్ 8వ తేదీన ఈ రిసెప్షన్ కార్యక్రమం ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ పెళ్లి ఏర్పాట్లపై నయనతార విఘ్నేష్ దంపతులు త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.