ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 4 జూన్ 2022 (17:54 IST)

కంటిన్యూ కాల్స్ తో నా ఫోన్ ఫ్రీజ్ అయిపొయింది - అడవి శేష్

Adavi Shesh,  Saiee Manjrekar, Shashi Kiran Thikka, Anurag, Sharat, Sri Charan Pakala
Adavi Shesh, Saiee Manjrekar, Shashi Kiran Thikka, Anurag, Sharat, Sri Charan Pakala
`ఇండస్ట్రీలో ఒక అలవాటు వుంది. మార్నింగ్ షో అయిపోగానే సినిమా గురించి మంచిగా వింటున్నాం అని మెసేజ్ వస్తే.. సినిమా పొయిందని అర్ధం. ఫోన్ కంటిన్యూగా మ్రోగుతుంటే సినిమా హిట్ అని అర్ధం. నిన్నటి నుండి  కంటిన్యూ కాల్స్ తో నా ఫోన్ ఫ్రీజ్ అయిపొయింది. కొత్త ఫోన్ కొనుక్కువాల్సివస్తుంది` అని   హీరో అడివి శేష్ అన్నారు. ఈ శుక్ర‌వార‌మే విడుద‌లైన మేజ‌ర్ స‌క్సెస్‌మీట్‌లో ఆయ‌న శ‌నివారంనాడు హైటెక్స్‌లోని వెస్ట్ర‌న్ హోట‌ల్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మాట్లాడారు.
 
శేష్ మాట్లాడుతూ, ఎమోషనల్ గా, కలెక్షన్స్ పరంగా ఇప్పటివరకూ నా సినిమాలన్నీటి కంటే 'మేజర్' ఐదు రెట్లు పెద్దది. మేజర్ సందీప్ విషయానికి వస్తే ఆయన్ని ఎంత ప్రేమించినా సరిపోదనే భావన వుంది. నా గత చిత్రం 'ఎవరు' కంటే ఐదు రెట్లు ఎక్కువగా మేజర్ ఓపెనింగ్స్ వున్నాయని బాక్సాఫీసు లెక్కలు చెబుతున్నాయి. ఐతే మేజర్ ని నేను సినిమాగా చూడటం లేదు ఇది ఎమోషన్. ఇదే సంగతి ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పా. ఈ ఎమోషన్ ఇంకా బిగ్గర్ కాబోతుందని ఇప్పుడు పోస్ట్ రిలీజ్ ఈవెంట్ లో చెబుతున్నా.నా యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు. మేజర్ సందీప్ పేరెంట్స్ ని మిస్ అవుతున్నా. అలాగే మా గురువు గారు అబ్బూరి రవి గారి సపోర్ట్ ని మర్చిపోలేను. ఈ చిత్రానికి గ్రేట్ గైడ్ అబ్బూరి రవి గారు. అన్నపూర్ణ స్టూడియోస్ టీంకి కృతజ్ఞతలు. ఒక పోస్ట్ ప్రొడక్షన్ హౌస్ చేయాల్సిన పనికంటే పది రెట్లు ఎక్కువ చేశారు. అలాగే కాస్ట్యూమ్స్ ని అద్భుతంగా డిజైన్ చేసిన రేఖాకి స్పెషల్ థ్యాంక్స్.
మేజర్ సినిమా చూసిన చాలా మంది ఫోర్స్ లో జాయిన్ అవ్వాలని వుందని మెసేజ్ పెడుతున్నారు. ఈ వేదికపై మేజర్ ప్రామిస్ చేస్తున్నా. సిడిఎస్, ఎన్డీఏ లో జాయిన్ అవ్వాలనుకుని సరైన వనరులు లేక కష్టపడుతున్న వారికి సపోర్ట్ చేయాలని మేజర్ టీమ్ నిర్ణయించింది. అది ఎలా అనేది రాబోతున్న రోజుల్లో స్పష్టంగా వెల్లడిస్తాం. మొదట ఒక పదిమందితోనే మొదలుపెడతాం. అది కోట్లమందిగా మారుతుందని నమ్ముతున్నాం. ఇదో పెద్ద మూమెంట్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరుతో ఈ మూమెంట్ ని లాంచ్ చేస్తాం. మేజర్ చిత్రాన్ని మా పేరెంట్స్ కి డెడికేట్ చేస్తున్నా. ఈ చిత్రాన్ని మరింత పెద్ద విజయం చేయాలని కోరుతున్నా.' అన్నారు.
 
దర్శకుడు శశి కిరణ్ తిక్క మాట్లాడుతూ.. మేజర్ అడవి శేష్ డ్రీం ప్రాజెక్ట్ అని నాకు ఎప్పుడో తెలుసు. ఐతే మేజర్ ని నన్ను డైరెక్ట్ చేయమన్నప్పుడు నేను పెద్దగా స్పందించలేదు. మేజర్ సందీప్ రియల్ హీరో అని తెలుసు. ఐతే ఆయన పాస్ పోర్ట్ సైజ్ ఫోటో చూడటం తప్పితే ఆయన గురించి డీప్ గా అప్పటికి తెలీదు. ఐతే నా టీం ని ఏర్పాటు చేసుకొని సందీప్ గురించి ఒకొక్క విషయం తెలుసుకోవడం మొదలుపెట్టాం. నా డైరెక్షన్ టీం వినయ్, రాజీవ్ ఎప్పుడూ నా పక్కనే వున్నారు. గౌతమ్ వీఎఫ్ ఎక్స్ అంతా తానె  చూసుకున్నాడు. దినేష్ , అనురాగ్, మనోజ్ కూడా అద్భుతంగా పని చేశారు. రచయిత అబ్బూరి రవి గారి సపోర్ట్ ని కూడా మర్చిపోలేం అన్నారు.
 
హీరోయిన్  సయీ మంజ్రేకర్‌ మాట్లాడుతూ... మేజర్ చిత్రంలో భాగం కావడం గర్వంగా వుంది. చాలా ప్యాషన్, డెడికేషన్, గౌరవంతో ఈ చిత్రం చేశాం. దేశ వ్యాప్తంగా మేజర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఆనందంగా వుంది. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన అడివి శేష్, శశి కిరణ్, నిర్మాతలు శరత్, అనురాగ్, జీఎంబీ, సోనీ పిక్చర్స్ కి కృతజ్ఞతలు'' తెలిపారు.
 
నిర్మాత శరత్ మాట్లాడుతూ.. మా మొదటి మేజర్ గొప్ప విజయాన్ని సాధించడం ఆనందంగా వుంది. ఇంత గొప్ప చిత్రం తర్వాత ఎలాంటి సినిమా చేయాలనే ఆందోళన కూడా వుంది. ఈ విషయంలో అడివి శేష్ మా వెంట ఉంటారని భావిస్తున్నా.  అడివి శేష్ మమ్మల్ని  ముందుండి నడిపించారు. మేజర్ సందీప్ కథ చెప్పడం, నమ్రత మేడమ్ గారిని కలవడం, తర్వాత సోనీ పిక్చర్స్ రావడం.. ఈ ప్రోసస్ అంతటిలో శేష్ వున్నారు. దర్శకుడు శశికి ఈ సినిమా తర్వాత ఫ్యాన్ అయిపోయా. యూనిట్ అంతా నమ్మకంగా పని చేశాం. ఆ నమ్మకమే ఈ రోజు మీకు తెరపై అంత అద్భుతంగా కనిపించింది.  అన్నారు
 
నిర్మాత అనురాగ్ మాట్లాడుతూ.. మేజర్ చిత్రానికి వస్తున్న రెపాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. సినిమాని చూసిన ప్రేక్షకులు ఒక ఎమోషనల్ లెవల్ దాటి మనసుతో స్పందిస్తున్నారు. ఇంటర్, డిగ్రీ చుడుకునే యూత్ మేజర్ చూసిన తర్వాత ఫోర్స్ లోకి వెళ్లాలని ప్రేరణ పొందడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. శరత్ వాళ్ళ అన్నయ్య కూడా ఫోర్స్ లో పని చేస్తారు. ఆయన లక్ష్య సినిమా చూసి ఫోర్స్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. ఇప్పుడు మేజర్ సినిమా చూసి మళ్ళీ అదే ప్రేరణ వచ్చిందని చెప్పడం చాలా ఆనందంగా వుంది. నెక్స్ట్ జనరేష్ ఇండియా మేజర్ చూసి ఫోర్స్ ని కెరీర్ ఎంచుకోవడమే అన్నిటికంటే పెద్ద విజయమని భావిస్తున్నాన‌ని తెలిపారు.
 
సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ,  దర్శకుడు శశి గారి ఫాదర్ చనిపోయిన మూడో రోజుకే శశి ఎంతో ధైర్యంగా సెట్స్ కి వచ్చారు. మా నాన్నగారి 11రోజు పూజ తర్వాత నేనూ మేజర్ టీజర్ మిక్సింగ్ కి వచ్చాను. మేజర్ విజయం మాకెంతో గర్వంగా వుంది.  నా యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు. మేజర్ సందీప్ గారి ఈ చిత్రం గొప్ప నివాళి.'' అన్నారు.