శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 9 జూన్ 2022 (15:57 IST)

ఘనంగా నయనతార-విఘ్నేష్ శివన్‌ల పెళ్లి, నయన్ ఎలా వుందో తెలుసా?

Vignesh Shivan-Nayanthara
కర్టెసి-ట్విట్టర్
టాలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతార, కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ల వివాహం గురువారం ఉదయం చెన్నై నగర శివారు ప్రాంతమైన మహాబలిపురంలో ఘనంగా జరిగింది. మహాబలిపురం ఈసీఆర్ రోడ్డులోని వడనెమ్మేలిలోని బీచ్ ఒడ్డున ఉన్న షెరటన్ గ్రాండ్ హోటల్‌లో అంగరంగం వైభవంగా జరిగింది. ఈ వివాహానికి సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు తరలివచ్చారు. 

 
సూపర్ స్టార్ రజనీకాంత్, విజయ్, బాలీవుడ్ అగ్రహీరో షారూక్ ఖాన్, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌తో పాటు అనేక మంది సినీ సెలబ్రిటీలు ఈ వివాహానికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Nayanthara
కర్టెసి-ట్విట్టర్
నయనతార విఘ్నేష్ శివన్ పెళ్ళి వేడుకలను ప్రముఖ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ ఏకంగా రూ.2.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ వివాహ ఘట్టానికి సినిమా స్క్రిప్టు‌ను రూపొందించి రెండు ఎపిసోడ్‌లుగా టెలికాస్ట్ చేయనుంది. మరోవైపు తమ పెళ్లివేడుకకు సంబంధించి రెండు ఫోటోలను నూతన జంట షేర్ చేసింది.