ఆదివారం, 3 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2022 (12:00 IST)

చిరంజీవి కుమార్తె శ్రీజ జాతకంలో నాలుగు పెళ్లిళ్లు..?!

Srija
మెగాస్టార్ చిరంజీవి కూతురు మాత్రం ఏకంగా ఇద్దరిని ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. కానీ ఇద్దరితో కూడా బ్రేకప్ చెప్పుకొని ఇప్పుడు మూడో పెళ్లికి సిద్ధమవుతోంది.
 
ఇకపోతే ఇటీవల ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి కూడా శ్రీజ భవిష్యత్తులో నాలుగు పెళ్లిళ్లు ఉన్నాయని మరో రెండు పెళ్లిళ్లు చేసుకునే అవకాశం కూడా ఉంది అని.. ఇక తన బాబాయ్ పవన్ కళ్యాణ్ అలాగే ఈమె జాతకాలు రెండూ ఒకే విధంగా ఉన్నాయి అని వేణు స్వామి వెల్లడించారు. 
 
ఈ క్రమంలోనే శ్రీజ మూడవ పెళ్ళికి సిద్ధమవుతున్న నేపథ్యంలో చాలామంది సినీ ప్రముఖులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా మూడవ వివాహం చేసుకోకపోవడమే మంచిది అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. 
 
కాగా.. మొదటి భర్త పెళ్లి విషయంలో తన బాబాయ్, తండ్రి నుంచి ప్రాణహాని ఉందని పోలీస్ కేసు పెట్టిన విషయం కూడా తెలిసిందే. కానీ అతడు మోసం చేయడంతో చివరికి తండ్రి దగ్గరకు చేరింది శ్రీజ. 
 
చిరంజీవి కోరిక మేరకు కళ్యాణ్ దేవ్‌ని వివాహం చేసుకుంది. కానీ అతడితో కూడా ప్రస్తుతం విడాకులు అయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
మూడో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మళ్లీ పెళ్లి, పెటాకులు చేసుకునే సందర్భం రావచ్చేమో అని ముందుగానే ఆలోచించిన చిరంజీవి ఆమె పేరు పైన అలాగే ఆమె కూతుర్ల ఇద్దరు పేరు పైన లైఫ్ టైం సెటిల్మెంట్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.