గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2022 (11:35 IST)

కమెడియన్ రఘు ఇంట్లో తీవ్ర విషాదం..

Raghu
Raghu
ప్రముఖ తెలుగు కమెడియన్ రఘు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి వెంకట్రావ్ కారుమంచి (74) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రఘు తండ్రి వెంకట్రావ్ గురువారం తుదిశ్వాస విడిచారు. 
 
జూన్ 10, 1947లో జన్మించిన వెంకట్రావ్ ఆర్మీ అధికారిగా సేవలదించారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన ఇంటిదగ్గరే వున్నారు. వెంకట్రావ్ మృతి పట్ల బంధుమిత్రులు, స్నేహితులు సంతాపం ప్రకటించారు. 
 
రోలర్ రఘు విషయానికి వస్తే.. రఘు ఈటీవీలో వచ్చే కామెడీ షో జబర్దస్త్‌లో నటించి మంచి పాపులర్ అయ్యారు. ఆ షోలో రఘు రోలర్ రఘు అనే టీమ్‌కు లీడర్‌గా ఉంటూ కొన్నాళ్లు కొనసాగారు. రఘు 2002లో వి.వి. వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆది సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు.