క్యాస్టింగ్ కౌచ్ అనేది మన ప్రవర్తనను బట్టి వుంటుంది.. సత్య శ్రీ
చమ్మక్ చంద్ర టీం నుండి బుల్లితెరకు పరిచయమైంది నటి సత్య శ్రీ. ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి రాకముందు పలు సీరియల్స్‌లో కూడా నటించింది. కానీ అంతగా ఈమెకు గుర్తింపు రాలేదు కేవలం జబర్దస్త్ ద్వారానే ఈమెకు గుర్తింపు వచ్చింది.
ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొంటారని విషయం అందరికీ తెలిసిందే అయితే తనకు ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఎదురు కాలేదని సత్య శ్రీ తెలియజేసింది.
ఇక తన తల్లి కూడా ఇండస్ట్రీలోనే ఉండడం, అలాగే తన అమ్మమ్మ రాజకీయాలలో బాగా పేరు ప్రఖ్యాతలు పొందడంతో తనవరకు క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు రాలేదని విషయాన్ని తెలియజేసింది సత్య శ్రీ.
ఇక జబర్దస్త్ నుండి తన గురువు అయిన చమ్మక్ చంద్ర బయటికి రావడంతో తమ టీ మొత్తం కూడా జబర్దస్త్ వీడమని తెలియజేసింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది మన ప్రవర్తనను బట్టి ఉంటుందని సత్య శ్రీ తెలియజేసింది.