గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 జులై 2022 (12:48 IST)

జబర్దస్త్‌లో చమ్మక్ చంద్ర లేరు.. అందుకే వెళ్లిపోయాం... సత్యశ్రీ

Chamak Chandra
Chamak Chandra
బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఎన్నో కామెడీ షోలలో జబర్దస్త్ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ క్రమంలోని ఎక్స్‌ట్రా జబర్దస్త్ కూడా పుట్టుకొచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది. ఇందులో ఫీమేల్ కమెడియన్స్ కూడా తమదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవారు. 
 
అలాంటి వారిలో ప్రముఖ లేడీ కమెడియన్ సత్య శ్రీ కూడా ఒకరు. ఈమె ఎక్కువగా చమ్మక్ చంద్ర స్కిట్ లలో మనకు కనిపించేది. హీరోయిన్ సైడ్ క్యారెక్టర్ కట్ ఉన్న సత్య శ్రీ సినిమాలలోకి వెళ్ళకుండా ఇలా జబర్దస్త్‌లో తనదైన శైలిలో ప్రేక్షకులకు కామెడీని పంచింది. 
 
ఇక తన కామెడీతో, అందంతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల చమ్మక్ చంద్ర జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో ఆమె కూడా వెళ్ళిపోయింది. సత్య శ్రీ ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో తాను జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడానికి గల కారణాన్ని కూడా వెల్లడించింది. 
 
సత్య శ్రీ మాట్లాడుతూ జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడానికి గల కారణం చమ్మక్ చంద్ర అని చెప్పింది. ఆయన్ని తాము గురువుగా భావించామని.. ఆయన ఎక్కడ వుంటే అక్కడే వుండే వాళ్లమని తెలిపింది. ఒకవేళ ఆయన జబర్దస్త్ ను విడిచి వెళ్లకుండా ఉండి ఉంటే మేము కూడా జబర్దస్త్ లోనే కొనసాగే వాళ్ళం. ఇక జబర్దస్త్‌లో తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. కేవలం చమ్మక్ చంద్ర తప్ప. ఇక ఆయన ముందుండి ఎన్నో సహాయ సహకారాలు అందించాడు. ఇక అందుకే ఆయన లేని జబర్దస్త్ షోలో మేము నటించకూడదని నిర్ణయించుకొని చమ్మక్ చంద్ర తో పాటు మేము కూడా వెళ్లిపోయాము అంటూ సత్య శ్రీ తెలిపింది. 
 
స్టార్ మా లో ప్రసారం అవుతున్న అదిరింది, కామెడీ స్టార్ట్స్ వంటి కామెడీ ప్రోగ్రామ్లలో చమ్మక్ చంద్రతో కలిపి సత్య శ్రీ ఎంటర్టైన్ చేస్తున్న విషయం తెలిసిందే.