గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 జూన్ 2022 (14:07 IST)

షూటింగులో అదిరే అభికి ప్రమాదం.. చేతికి 15 కుట్లు

adhire abhi
ప్రముఖ టీవీ షో జబర్దస్త్ కమెడియన్, టాలీవుడ్ నటుడు అదిరే అభి ఓ చిత్ర షూటింగులో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో చేతికి గాయం తగలింది. ఈ గాయానికి వైద్యులు 15 కుట్లు వేసినట్టు సమాచారం. దీంతో గాయం మానేంత వరకు ఆయన విశ్రాంతి తీసుకోనున్నారు. 
 
కాగా, జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చిన అదిరే అభి.. ప్రస్తుతం స్టార్ మోరో ప్రైవేట్ టీవీలో సాగుతున్న కామెడీ స్టార్స్ అనే షోలో చేస్తున్నారు. ప్రస్తుతం టీవీ షోలకు దూరంగా ఉంటూ సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. తన సినీ కెరీర్ సాఫీగా సాగిపోతుందన్న సమయంలో అదిరే అభికి ప్రమాదం జరిగింది.