శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 మే 2022 (09:58 IST)

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి

road accident
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం నుంచి తిరిగి వస్తున్నటాటా ఏస్ వాహనం.. రెంటచింతలోని కరెంట్ ఆఫీస్ వద్ద ఆగి ఉన్న లారీను ఢీకొంది. 
 
ఈ ప్రమాదంలో వాహనం పల్టీ కొట్టింది. దీంతో అందులో కిక్కిరిసి ప్రయాణిస్తున్న వారంతా ఒకరిపై ఒకరు పడిపోయారు. 
 
ఈ ఘటనలో అక్కడికక్కడే 9 మంది మృతి చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నవారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ప్రమాద సమయంలో టాటా ఎస్ వాహనంలో 38 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది. 
 
వీరంతా రెంటచింతల బీసీ కాలనీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి కారణం చీకటితో పాటు.. డ్రైవర్ రహదారిపై ఆగి ఉన్న ఉన్న లారీని గమనించకపోవడంతో ప్రమాదం జరిగింది.