బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 మే 2022 (11:15 IST)

అన్నమయ్య జిల్లాలో ఘోరం - రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం

road accident
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె గ్రామీణం పుంగనూరు రోడ్డు 150వ మైలు వద్ద ఈ ప్రమాదం జరిగింది.
 
వేగంగా దూసుకొచ్చిన ఓ కారు కల్వర్టును ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి చెరువులోపడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళి నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన రెడ్డివారిపల్లె చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో గంగిరెడ్డి, మధులత, వారి కుమార్తె కుషితా రెడ్డి, కుమారుడు దేవాన్ష్ రెడ్డిలను గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.