బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 మే 2022 (16:03 IST)

వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్నందుకే చంపేశా : వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు

anantha babu
తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్నందుకే తన కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపేసినట్టు వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ బాబు తెలిపారు. ఈ కేసులో ఆయన్ను కాకినాడ పోలీసులు వెల్లడించిన విషయం తెల్సిందే. 
 
ఏపీలోని కాకినాడలో జరిగిన ఈ హత్య కేసుతో గత నాలుగు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేసిన అనంతబాబు చేసిన నేరాన్ని అంగీకరించారు. 
 
తన వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నందుకే తాను ఒక్కడికే ఆయన్ను చంపానని పోలీసులకు చెప్పాడు. మరోవైపు, ఎమ్మెల్సీ అరెస్టు వివరాలను డీజీఐ పాలరాజు సోమవారం సాయంత్రం అధికారికంగా వెల్లడించనున్నారు.