సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 మే 2022 (16:13 IST)

డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టడం వల్లే చనిపోయాడు... ఫోరెన్సిక్ నివేదిక

driver subrahmanyam
వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ బాబు వద్ద డ్రైవరుగా పని చేస్తూ అనుమానాస్పదంగా మృతి చెందిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులోని మిస్టరీ వీడిపోయింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను తీవ్రంగా కొట్టడం వల్లే శరీరంలోని అంతర్గత అవయవాలు దెబ్బని ప్రాణాలు విడిచినట్టు ఫోరెన్సిక్ నివేదిక తేల్చింది. దీంతో ఎమ్మెల్సి అనంతబాబు చుట్టూ మరింతగా ఉచ్చు బిగిసినట్టయింది.
 
మరోవైపు డ్రైవర్ సుబ్రహ్మణ్యంది హత్యేనని తేలడంతో స్థానికంగా భారీ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అదేసమయంలో ఎమ్మెల్సీ అనంతబాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆయన ఈ హత్య కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, మృతుని కుటుంబ సభ్యులు, ప్రతిపక్షాలు, దళిత, ప్రజా సంఘాల ఆందోళనలు, నిరసనలతో పోలీసులు అనంత ఉదయభాస్కర్‌ను ఈ కేసులో ఏ1 నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. 
 
ఇదిలావుంటే, డ్రైవర్ సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ఆయన స్వగ్రామం జి.మామిడాడలో పూర్తి చేశారు. సుబ్రహ్మణ్యం మృతిపై హత్య కేసునే నమోదు చేసినట్టు కాకినాడ ఎస్పీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. అయితే, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. తాము మృతుడి కుటుంబాన్ని టార్చర్ పెట్టలేదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అదేసమయంలో మహిళా పోలీసులతో మృతుడి భార్యను కొట్టించినట్టు వార్తలను కూడా ఆయన తోసిపుచ్చారు.