మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుబై కేసు.. ఏ క్షణమైనా అరెస్టు

ananta bhaskar babu
తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్‌పై పోలీసులు సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అతడిని కీలక నిందితుడిగా పేర్కొన్నారు. దీంతో అజ్ఞాతంలో ఉన్న ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 
 
ఇదే అంశంపై కాకినాడ ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ ఆదేశాల మేరకు డ్రైవర్‌ మృతి కేసును సీరియస్‌గా విచారిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. 
 
అందువల్ల ఈ హత్య కేసులో నిందితుడిని అనంత భాస్కర్‌ను అదుపులోకి తీసుకుంటామన్నారు. ఎమ్మెల్సీ ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో వివిధ సెక్షన్లను ఈ కేసులో చేర్చేందుకు పోలీసులు న్యాయపరమైన అభిప్రాయాన్ని తీసుకుంటున్నారని తెలిపారు.