మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 మే 2022 (16:36 IST)

నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కారు

tspolice
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇప్పటికే మూడేళ్ల వయోపరిమితి పెంచిన సర్కారు తాగా నిరుద్యోగ అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు మరో రెండేళ్ళ పాటు వయో పరిమితిని పెచుతూ నిర్ణయం తీసుకుంది. 
 
పోలీసు ఉద్యోగ అభ్యర్థుల విన్నపాలను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలను సీఎం కేసీఆర్ ఆదేశించారు.