1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 19 మే 2022 (16:11 IST)

తెర వెనుక బోలెడు కథ వుంది - దిల్‌రాజు చెప్పిన ర‌హ‌స్యాలు

Dilraju,
Dilraju,
నైజాంలో థియేట‌ర్ల స‌మ‌స్య‌ల‌పైకానీ, టికెట్ల‌పై కానీ ఏ స‌మ‌స్య వ‌చ్చినా న‌న్నే టార్గెట్ చేస్తున్నారు. ఇది నిజం కాద‌ని అస‌లు ఏమిటో తెర‌వెనుక చాలా విష‌యాలు వుంటాయ‌ని నిర్మాత దిల్‌రాజు స్ప‌ష్టం చేశారు.  ఈనెల 27న ఆయ‌న నిర్మించిన ఎఫ్‌3 విడుద‌ల‌కాబోతుంది. ఈ సంద‌ర్భంగా ప‌లు విష‌యాల‌ను ఆయ‌న తెలియజేశారు.
 
ఎఫ్3 కి టికెట్ రేట్లు తగ్గించిన నేపధ్యంలో మంచి రెస్పాన్స్ వస్తే మిగతా సినిమాలు కూడా ఇదే పద్దతి ఫాలో అయ్యే అవకాశం ఉందా ?
మొన్న సినిమాలు విడుదలైనప్పుడు రేట్లు పెరిగాయి. ఆ రేట్లు నేను పెంచానని విమర్శించారు. నైజాంలో దిల్ రాజు రిలీజ్ చేశాడు కాబట్టి ఆయనే పెంచేశాడని సులువుగా అనేస్తారు. కానీ తెర వెనుక బోలెడు కథ వుంటుంది. నిర్మాతలు, హీరోలు ఇలా బోలెడు లెక్కలు వుంటాయి.
అందుకే టికెట్ రేట్లు తగ్గిస్తూ మొదట నేను ఒక అడుగు వేస్తున్నా. ఇది కనుక సక్సెస్ ఐతే అందరూ ఇదే ఫాలో అవుతారు. ప్రస్తుతానికి అందరూ ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.
 
మల్టీ ప్లెక్స్ లో చార్జీలు ఎలా ఉండబోతున్నాయి ?
ప్రసాద్, జీఎంబీ లాంటి ప్రైమ్ మల్టీ ప్లెక్స్ 250 ప్లస్ జీఎస్టీ.. మిగతావి జీఎస్టీ కలుపుతూ 250. దాదాపు 45 రూపాయ‌లు ప్ర‌భుత్వానికి పోతుంది. ఎగ్జిబిట‌ర్‌కు 125 పోతుంది. పంపిణీదారుడికి నిర్మాత‌కు మిగిలింది వ‌స్తుంది. సుమారు 125 వ‌స్తుంద‌న్న‌మాట‌. అలాగే హైదరాబాద్ లో సింగల్ స్క్రీన్స్ అన్నీ  150ప్లస్   జీఎస్టీ జిల్లాలు జీఎస్టీ కలుపుతూ 150. 250లో మాకు వచ్చేది 125రుపాయిలే. కానీ మొత్తం మాకే వ‌స్తుందనీ, దిల్‌రాజుకే చెందుతుంద‌నే త‌ప్పుడు భావ‌న ప్ర‌జ‌ల్లో నెల‌కొంది.
 
థియేట‌ర్ల‌వ‌ల్ల  లాభాలు బాగా వ‌స్తున్నాయ‌నే టాక్ వుంది?
థియేటర్ వుండటం వలన ఎదో అద్భుతమైన లాభాలు వచ్చేస్తున్నాయనే అపోహ కూడా వుంది. కర్నూల్ లో 15కోట్లు పెట్టి  మల్టీ ప్లెక్స్ లో ఇన్వెస్ట్ చేశాం.  పదేళ్ళు లీజు. పదిహేను కోట్లు  వడ్డీతో సహా రిటర్న్ తెచ్చుకోవాలి. లెక్క చూసుకుంటే రూపాయికి వడ్డీ వస్తుంది. పది హేను కోట్ల మీద నెలకి పదిహేను లక్షలు వస్తుందని అనుకుందాం. కానీ పదేళ్ళలో ఈ పదిహేను కోట్లు పోయి జీరో అవుతుంది. దిని ప్రకారం చూసుకుంటే నష్టమే. మల్టీ ప్లెక్స్ అన్నిటిలో ఈ సమస్య వుంది. షేర్ మార్కెట్ కోసం కార్పోరేట్ కంపెనీలు చేస్తున్న ఒక అపోహ ఇదంతా.
 
మీకు చాలా థియేట‌ర్లు వున్నాయిక‌దా?
దీని గురించి ప్ర‌జ‌ల‌కు పూర్తి క్లారిటీ ఇవ్వాలి. ఒక థియేటర్ల గురించి చెప్పాలంటే, నైజాంలో మొత్తం 450థియేటర్లు వున్నాయి.  ఇందులో మా సంస్థకు 60 వున్నాయి. దిల్ రాజు నైజాం మొత్తం కంట్రోల్ పెట్టుకున్నాడని చాలా మంది అంటారు. కానీ 60 థియేటర్లతో నేను కంట్రోల్ లో పెట్టుకునేది ఏమీ వుండదు. కానీ మిగతా వాళ్ళు మా మాట ఎందుకు వింటారంటే .. ఎవరైనా రూపాయి డబ్బు మాకు అడ్వాన్స్ గా ఇస్తే సినిమా అయిపోగానే రెండు మూడు వారాల్లో వారి ఖాతా సెటిల్ చేసుకొని వెళ్ళిపోతారు. మాకు ఇచ్చిన డబ్బు అంత సేఫ్ గా వుంటుంది. ఎక్కువ సినిమాలు చేయడం వలన ఆటోమేటిక్ గా మాకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ రెండు కారణాల వల్ల మేము నెంబర్ వన్ గా వున్నా తప్పితే ఏదో కంట్రోల్ చేసి కాదు. అని ముగించారు.