గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 మే 2022 (12:15 IST)

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన : ఐఎండీ హెచ్చరిక

తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఓ హెచ్చరిక చేసింది. ఈ నెల 21వ తేదీ వరకు ఈ రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులకు చేరుకున్న నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. అందువల్ల మరో వారం రోజుల్లో కేరళను తాకే అవకాశం ఉందని తెలిపింది.
 
కాగా, ఈ దఫా ముందుగానే నైరుతి రుతుపవనాలు మన దేశంలోకి ప్రవేశించనున్నాయి. జూన్ 5వ తేదీ జూన్ 10వ తేదీ వరకు తెలంగాణాలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అనుకూల వాతావరణం నెలకొనివుందని తెలిపింది. 
 
ఈ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీతో పాటు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, దక్షిణ, కోస్తా, రాయలసీమలో రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది.