రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ముఖేష్ కుమార్ మీనా
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముకేష్ కుమార్ మీనా గురువారం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ లోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో మద్యాహ్నం 12.06 గంటలకు కె.విజయానంద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన తదుపరి ముకేష్ కుమార్ మీనాను కె.విజయానంద్ దుశ్శాలువాతో సత్కరించి అభినందించారు.
అనంతరం ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బందిని ముకేష్ కుమార్ మీనాకు పరిచయం చేశారు. మీనా వారితో ప్రాధమికంగా సమావేశమై ప్రస్తుతం పరిశ్రమలు (ఆహార శుద్ది), ఆర్ధిక ( వాణిజ్య పన్నులు), చేనేత జౌళి శాఖ కార్యదర్శిగా ఉన్న మీనాకు ఈ పదవితో కీలకమైన బాధ్యతలు అప్పగించినట్లయ్యింది. తన సర్వీసులో భాగంగా విభిన్న పదవులను అలంకరించిన మీనా తనదైన శైలిలో పనిచేసి ప్రజల మన్ననలు అందుకున్నారు.
తన పదవీ కాలంలో నెల్లూరు, విశాఖపట్నంలలో అసిస్టెంట్ కలెక్టర్, ఐటిడిఎ పిఓ, కర్నూలు జాయింట్ కలెక్టర్, ప్రకాశం, కర్నూలు కలెక్టర్, సిఎస్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, విశాఖపట్నం నగర పాలక సంస్ధ కమీషనర్, క్రీడాభివృద్ది సంస్ధ ఎండి, ఖనిజాభివృద్ది సంస్ధ ఎండి, రాష్ట్ర విభజన వంటి అత్యంత కీలక సమయంలో హైదరాబాద్ కలెక్టర్, జిఎడి కార్యదర్శి పదవులలో మీనా రాణించారు.
పర్యాటక, భాషా, సాంస్కృతిక, పురావస్తు శాఖ కార్యదర్శిగా మీనా అధ్బుతాలు సృష్టించారనే చెప్పాలి. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంతో సహా రెండు పర్యాయాలు అబ్కారీ కమీషనర్‌గా విధులు నిర్వహించిన మీనా అత్యంత ప్రతిభావంతమైన అధికారిగా పేరు గడించారు. అక్రమమధ్యానికి అడ్డుకట్ట వేస్తూ జాతీయ స్ధాయిలో ఖ్యాతి గడించి అప్పట్లో ఎన్నికల కమీషన్ అభినందనలు అందుకున్నారు. తుదుపరి సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా వారి సంక్షేమం విషయంలో పారదర్శకంగా, సమర్ధవంతంగా వ్యవహరించారు.
కొద్ది నెలల వ్యవధిలోనే అత్యంత కీలకమైన గవర్నర్ కార్యదర్శిగా నూతన రాజ్ భవన్ వ్యవస్ధకు అంకురార్పణ చేసి, అతితక్కువ కాలంలోనే దాని రూపు రేఖలను తీర్చిదిద్దారు. తీసుకువచ్చారు. అత్యాధునిక సాంకేతికత ఆలంబనగా స్పష్టమైన ప్రణాళికలు అమలు చేసి రాజ్ భవన్ ప్రతిష్టను ఇనుమడింపచేసారు. సమర్ధుడు, సౌమ్యునిగా పేరున్న మీనా 2024 సాధారణ ఎన్నికలు జరగవలసిన వేళ ప్రధాన ఎన్నికల అధికారిగా వచ్చారు.