శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 మే 2022 (16:14 IST)

ఏపీ ప్రజలకు బిగ్ రిలీఫ్-ఇకపై కరెంట్ కోతలు వుండవు.. సర్కారు గుడ్ న్యూస్

ys jagan
అసలే ఎండలు భగ్గుమంటున్నాయి. మధ్యలో అసని తుఫాను వచ్చి కాస్త ఏపీ చల్లబడినా.. విద్యుత్ కోతలతో జనం నానా తంటాలు పడుతున్నారు. డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో కోతలు తప్పలేదు. ఇలాంటి పరిస్థితిల్లో ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. 
 
రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. పరిశ్రమలకు కూడా నిరంతర విద్యుత్ సరఫరా చేయబోతున్నట్లు ప్రకటించింది. 
 
బొగ్గు సమస్యతో ఏప్రిల్ 7 నుంచి పరిశ్రమలకు విద్యుత్ కోతలు విధించింది ప్రభుత్వం. వారంలో ఒక రోజు పవర్‌ హాలిడే ప్రకటించింది. అయితే ఈ నెల 9 నుంచి పరిశ్రమలకు పవర్ హాలీ డే కూడా ఎత్తివేసింది. 
 
ఇకపై అన్ని రంగాలకు 100 శాతం విద్యుత్ సరఫరా ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. బొగ్గు నిల్వలు అందుబాటులోకి రావడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.  
 
కర్ణాటక, కేరళలో కురిసిన వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని జలాశయాలకు నీటి రాక పెరిగింది. మెట్టూరు, భవానీసాగర్, ముల్లైపెరియార్ తదితర జలాశయూల్లో విద్యుత్ ఉత్పత్తి మెరుగుపడింది. దీంతో జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి పెరిగింది. ఫలితంగా కరెంట్ కోతలకు చెక్ పడింది.