1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 మే 2022 (10:08 IST)

ఏపీలో ఒక్కో అబ్బాయికి నలుగురు అమ్మాయిలతో..

romance
దక్షిణాదిలో ఒకరి కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు వున్న మగవారిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మగాళ్లు ముందున్నారు. ముఖ్యంగా ఏపీలో మాత్రం ఒక్కో అబ్బాయి తనకు ఒకరి కంటే ఎక్కువ మంది లైంగిక సంబంధాలు కలిగి వున్నట్లు వెల్లడైంది. అలాగే తెలంగాణలో ఒక్కో పురుషుడు ముగ్గురితో లైంగిక సంబంధం ఉన్నట్లు సర్వే ద్వారా తెలిసిందే. 
 
నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే-5 రెండో విడతలో భాగంగా నిర్వహించిన ఏపీలోని మహిళలతో పోలిస్తే పురుషులు ఎక్కువ మందితో సంబంధాలు కలిగి ఉన్నామని ఒప్పుకున్నారు. జీవితకాలంలో ఎంతమంది లైంగిక భాగస్వాముల్ని కలిగి ఉన్నారనే ప్రశ్నకు మహిళల సగటు 1.4గా ఉంటే పురుషుల సగటు 4.7గా ఉంది. 
 
మిగిలిన దక్షిణాది రాష్ట్రాల కంటే ఏపీలోనే పురుషులకు ఎక్కువ మంది స్త్రీలతో సంబంధాలు కలిగి ఉన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫలితాలలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా 2020-21 మధ్య 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిపై ఈ సర్వే నిర్వహించారు.