బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 మే 2022 (07:41 IST)

22 నుంచి తెలంగాణ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన

ktramarao
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కేటీఆర్ మంగళవారం నుంచి పర్యటిచనున్నారు. ఇందులోభాగంగా ఆయన మంగళవారం లండన్‌కు బయలుదేరి వెళుతారు. ఈ విదేశీ పర్యటన మొత్తం 10 రోజుల పాటు సాగనుంది. 
 
ముఖ్యంగా, ఈ నెల 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సుకు హాజరయ్యే పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీలు, అధినేతలు, సీఈవోలతో భేటీ నిర్వహిస్తారు. 
 
ఈ సందర్భంగా ఆయన తెలంగాణాలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. ఆ తర్వాత ఈ నెల 26వ తేదీన తిరిగి హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు. 
 
ఈ విదేశీ పర్యటన కోసం మంత్రి కేటీఆర్ మంగళవారం లండన్‌కు బయలుదేరి వెళతారు. ఉదయం పది గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆయన లండన్‌‍కు చేరుకుంటారు. తన లండన్ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు రావడమే లక్ష్యంగా వివిధ కంపెనీల అధిపతులు, సీఈవోలతో కేటీఆర్ భేటీ అవుతారు.