గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 మే 2022 (18:33 IST)

మీ తండ్రి ఓ పాస్‌పోర్టు బ్రోక‌ర్ అనే సంగ‌తి మ‌రిచారా? నోరు అదుపులో..?

DK Aruna
టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ నోరు అదుపులో పెట్టుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్య‌క్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ సూచించారు. ఈ మేరకు సోమ‌వారం సాయంత్రం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆమె ఓ పోస్ట్ పెట్టారు. 
 
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మీద‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మీద కామెంట్లు చేస్తున్నారంటూ డీకే అరుణ ఫైర్ అయ్యారు. "అస‌లు మీ అయ్యా కొడుకుల స్థాయి ఏమిటి?  మీ బ‌తుకు ఏమిటి? అంటూ డీకే అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 
 
మీ తండ్రి ఓ పాస్‌పోర్టు బ్రోక‌ర్ అనే సంగ‌తి మ‌రిచారా? అంటూ కేటీఆర్‌పై విరుచుకుప‌డ్డారు. ఇప్ప‌టికైనా నోటిని అదుపులో పెట్టుకోవాల‌ని ఆమె కేటీఆర్‌కు సూచించారు.