బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 మే 2022 (12:05 IST)

తీపి కబురు చెప్పిన వాతావరణ శాఖ

rain
దేశం వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఒకవైపు ఎండలు, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. 
 
వచ్చే 24 గంటల్లో భారత్‌లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది. అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు వస్తాయని తెలిపింది. ఆ తర్వాత బంగాళాఖాతం, హిందూ మహా సముద్రంలో రుతపవాలు విస్తరిస్తాయని వెల్లడించింది. 
 
ఆ తర్వాత ఈ నెలాఖరులోగా కేరళను తాకుతాయని చెప్పింది. జూన్ 8వ తేదీ లోగా తెలంగాణా రాష్ట్రంలోకి ఈ రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది. ఇదిలావుంటే, ఆదివారం రాత్రి తెలంగాణా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.