1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 మే 2022 (14:19 IST)

ముందుగానే నైరుతి .. శుభవార్త వెల్లడించిన ఐఎండీ

daimond rain
నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించనున్నాయి. భారత వాతావరణ శాఖ శుభవార్త అందించింది. నైరుతి రుతుపవనాలు ఈసారి 4 రోజులు ముందుగానే వస్తాయని అంచనా వేసింది. అనేకంగా ఈ నెల 27వ తేదీన కేరళ తీరాన్ని తాకుతాయని వెల్లడించింది.
 
ఈ యేడాది ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైన విషయం తెల్సిందే. పగటి ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో జనం అల్లాడుతున్న వేళ భారత వాతావరణ శాఖ శుభవార్త అందించింది. 
 
నైరుతు రుతుపవనాలు ఈసారి ముందుగానే వస్తున్నాయని తెలిపింది. ఈసారి రుతుపవనాలు మే 27న కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతవరణ శాఖ వెల్లడించింది. 
 
సాధారణంగా జూన్‌ 1న రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయి. ఒక్కోసారి జూన్ 10 కూడా అవుతుంది. ఈసారి 4 రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తుండటం ఊరటనిచ్చే అంశం.
 
ఈసారి రుతుపవనాలతో దేశంలో సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రైతులకు శుభవార్తే.
 
మే 22 నాటికే అండమాన్‌ తీరాన్ని రుతుపవనాలు తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మే 15 వరకే బంగాళాఖాతం నైరుతి భాగానికి రుతుపవనాలు చేరుకోవచ్చునని తెలిపింది. జూన్ 1కి కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేసింది.