మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 మే 2022 (07:37 IST)

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారిన 'అసని'

cyclone
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను ఇపుడు తీవ్ర రూపం దాల్చింది. ఇది ఆదివారం సాయంత్రానికి మరింతగా బలపడి తీవ్ర తుఫానుగా మారింది. ప్రస్తుతం ఈ తుఫాను కార్ నికోబార్ దీవికి వాయువ్యంగా 610 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్టణంకు ఆగ్నేయంగా 810 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుంది. 
 
అయితే, ఇది పశ్చిమ దిశగా పయనిస్తూ మే 10వ తేదీ నాటికి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు చేరువగా వస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) వెల్లడించింది. అక్కడ నుంచి దిశ మార్చుకుని ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని ఐఎండీ తెలిపింది. 
 
ఈ తుఫాను ప్రభావం కారణంగా ఉత్తరాంధ్ర తీరాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, 11వ తేదీన ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల్లో ఇదేతరహా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. మే 12వ తేదీన ఒడిశా, వెస్ట్ బెంగాల్ తీర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొంది.