మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 మే 2022 (19:28 IST)

13న ఏపీ మంత్రివర్గం భేటీ - సీఎం జగన్ అధ్యక్షతన...

ys jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమాచారం ఈ నెల 13వ తేదీన జరుగనుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ మీటింగ్ జరుగనుంది. ఇటీవల ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువుదీరిన విషయం తెల్సిందే. ఈ మంత్రివర్గం ఇప్పటివరకు ఒక్కసారి కూడా భేటీ కాలేదు. మరో రెండేళ్ళలో ఎన్నికలు జరుగనున్నందున అప్పటివరకు ఇక మంత్రివర్గాన్ని మార్చే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రివర్గం సమావేశం ఈ నెల 13వ తేదీన జరుగనుంది.
 
ఈ సమావేశంలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కేబినెట్‌ భేటీలో అనేక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.