బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాను ముప్పు

cyclone
'అసాని' తుఫాను తీవ్రరూపం దాల్చడంతో ఉద్రిక్తత మరింత పెరిగి మంగళవారం నాటికి ఆంధ్రప్రదేశ్ - ఒడిశా తీరానికి చేరుకునే అవకాశం ఉందని అమరావతి ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అసాని తుఫానుగా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అసని తుఫాను తీవ్ర తుపానుగా బలపడుతోందని, దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
 
ఈ తుఫాను ప్రభావం కారణంగా గంటకు 100 కి.మీ కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. దీంతో అధికారులు అప్రమత్తమై మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తుఫాను ప్రభావం ఒడిశాపై ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.