శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 మే 2022 (18:54 IST)

ఓట్లు చీలకూడదు.. జగన్‌ ప్రభుత్వాన్ని మట్టికరిపించాలి

Manohar-Pawan
ఓట్లు చీలకూడదు.. జగన్‌ ప్రభుత్వాన్ని ఓడించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సూచించినట్టు తెలిపారు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌ అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ ఓటు చీల‌కుండా చూడ‌ట‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. 
 
ఇప్ప‌టికే దీనిపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేశార‌ని కూడా నాదెండ్ల పేర్కొన్నారు. టీడీపీతో పొత్తు విష‌యాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్ణ‌యిస్తార‌ని నాదెండ్ల తెలిపారు. ప్ర‌స్తుతం బీజేపీతో త‌మ పార్టీకి స‌త్సంబంధాలు కొన‌సాగుతున్నాయ‌ని నాదెండ్ల స్పష్టం చేశారు. 
 
ఇదిలా ఉంటే.. ఎన్నికల‌కు సంబంధించి ఏపీలో అధికార వైసీపీకి వ్య‌తిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఆ దిశ‌గా స‌మష్టి ఉద్య‌మం జ‌ర‌గాల్సి ఉందని, ఆ ఉద్య‌మానికి టీడీపీ నాయ‌క‌త్వం వ‌హిస్తుంద‌ని ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు శుక్ర‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.