మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

పక్కింటిలోని ఆరేళ్ళ బాలికపై అత్యాచారం

woman victim
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి, గుంటూరు, రేపల్లె రైల్వే స్టేషన్‌లలో జరిగిన అత్యాచార ఘటనలు రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపాయి. గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రేమ పేరుతో ఓ ఫార్మసీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగి యువతిని చంపేశారు. తాజాగా అనకాపల్లిలో పక్కింటిలో నివసించే ఆరేళ్ళ బాలిక అత్యాచారానికి గురైంది.
 
ఆరేళ్ల చిన్నారిని పక్కింటి వ్యక్తి కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటన అనకాపల్లి నర్సీపట్నంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ప్రాథమిక సమచారం మేరకు, బాలిక తన అక్కతో కలిసి తెల్లవారుజామున 2 గంటలకు టాయిలెట్‌కు వెళ్లిగా, కామాంధుడు కాపుకాసి ఆ చిన్నారిపై లైంగికదాడికి తెగబడ్డాడు.  
 
తన సోదరిని ఎవరో కిడ్నాప్ చేశారని బాలిక సోదరి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. అనంతరం తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను తల్లిదండ్రులు గుర్తించారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు