సంబంధిత వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా?
- రాజధానిపై కోర్టు తీర్పును ధిక్కరించిన సర్కారు.. నేడు హైకోర్టులో విచారణ
- 35 పోస్టల్ సర్కిళ్లలో 38,926 పోస్టుల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్
- నో-ఫోన్ జోన్లుగా పరీక్షా కేంద్రాలు.. అవన్నీ వాడితే అంతే సంగతులు
- కొన్ని అత్యాచారాలు అలా జరిగిపోతుంటాయ్.. ఏం చేయలేం .. మంత్రి తానేటి
నేటి నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైతే...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10,01,058 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో మొదటి సంవత్సరం, రెండో సంవత్సర విద్యార్థులు సరి సమానంగా ఉన్నారు. ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1456 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తాయి.
అయితే, ఈ పరీక్షల కోసం ఇంటర్ బోర్డు అధికారులు కీలక ప్రకటన చేశారు. పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్షకు అనుమతించబోమని తెలిపారు. అదేవిధంగా పరీక్షా కేంద్రం లేదా హాలులోకి మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ అనుమతించరని తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు జిల్లాకు ఐదు చొప్పు ఫ్లయింగ్ స్క్వాడ్స్‌లు, సిట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామని, అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు విద్యా శాఖ తెలిపింది.
తర్వాతి కథనం
